Sri suktha Rahasyardha pradeepika
Chapters
శ్రీమాత కిది యంకితము కమల! నాచూపు పున్నమచూ పమావాస్య చూపు పాడ్యమినాఁటి చూడ్కి యనవు; ఏణాంకశతశంక నెసఁగు చిర్నగుమోము నిగ్గువెల్లువల మున్గింతు వీవు; ఈదృశంబని పల్క నెనలేని బలుతళ్కు తోఁదోఁచి నాయున్కి తోఁపనీవు; లలితలాస్యమున నిశ్చలత సంవిద్దేవ తలకెల్లఁగూర్చి నన్దన్పు దీవు; హ్రీంపీఠసంస్థరాజేశ్వరీ! నీయాన శీర్షధార్యముగ శిక్షించితీవు; హరరూప శంకరగురుని 'సౌందర్యల హరి''కిఁ దెన్గన్న సాహసముఁగొంటి; సరస ''బాలాంబికా'' సంజ్ఞతో నాస్తుతి శతకమన్నను యథాశక్తినంటి; కలవుగా ''మనముచ్చటలు'' కొన్ని వందలు పలుకుమన్నను మూడు వందలంటి; హర్షింపఁగా సూర్యుఁడా ''సౌరమంత్రముల్'' తెన్గింపుమన్నంతం దెగువ గొంటి; లలితమౌ తెన్గు పద్దెలు కాళిదాసుని ''పంచస్తవికి'' నన్న పసుపు గొంటి; ''హ్రీంకారభావము'' లేరిచి నూఱు, నీ కర్పింతునన ''నాగు''మన్న వింటి; సకలసాధకహర్షసంధాయి ''శ్రీసూక్త గుప్తార్థ'' మెదొ తెల్పఁగోరుకొంటి, కలము పట్టుము, కల్యాణకాంక్షి! యనఁగ లబ్ధసుఖినౌచు వ్రాసి యీ లలితకృతిని, హ్రీంశరీరిణి! శ్రీంశరీరికిణికి నీకె ఈంమతీ! యందచు నిచ్చితి నేలుకొమ్ము|| -